నేడు లాభాల్లో భారత్ స్టాక్ మార్కెట్.... 26 d ago
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ... మంగళవారం భారత్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సానుకూలంగా ప్రారంభమైంది. ఉదయం 9:30 ప్రాంతంలో సెన్సెక్స్ 253.23. లాభంతో 80,363 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 24,304 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.24 గా కొనసాగుతోంది.సెన్సెక్స్ 30లో ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐసిఐ బ్యాంక్, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.